ముజఫర్‌నగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
posted on Sep 11, 2013 @ 10:18AM
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. గత 5 రోజులుగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాలను అదుపు చేసేందుకు కేంద్ర బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాఅల్లర్లు అదుపు చేయడం మాత్రం వారి వల్ల కావటం లేదు. ఇప్పటికే ఈ ఘటనలో దాదాపు 45 మందికి పైగా మరిణించారు.
కేంద్ర బలగాలు , సీఆర్ఫీఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా సైన్యం రంగంలోకి దిగింది. ముజఫర్ నగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించింది. ముందు జాగ్రత్తగా చర్యగా ముజఫర్‌నగర్ జిల్లాలోని అన్ని ఆయుధాల లైసెన్స్‌లను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఇప్పటికే 300 మందిని అదుపులోకి తీసుకున్న ప్రభుత్వం మరికొంత మంది అరెస్ట్‌కు రంగం సిధ్దం చేసింది.
యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అల్లర్లపై ప్రత్యేకం సమావేశం అయ్యారు. వెంటనే పరిస్ధితిని సాదారణ స్థితికి తీసుకురావటంతొ పాటు నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామి ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.