Read more!

అమెరికా కేసు : సోనియా కుంటి సాకు

 

సిక్కుల ఊచకోతకి సంబంధించి అమెరికా కోర్టు సోనియాగాంధీని నిను వీడని నీడను నేనే అన్నట్టు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు సోనియాగాంధీ పీకకి తాచుపాములా చుట్టుకుంది. ఎప్పుడు సోనియా సదరు పాము కాటుకి గురవుతుందో అర్థంకానట్టుంది. ఆమధ్య సోనియా క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఆమెకు ఈ కేసుకు సంబంధించిన నోటీసులను అమెరికా ప్రభుత్వం జారీ చేసింది. వాటిని సోనియా లక్ష్యపెట్టకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా అమెరికా సోనియాని తన పాస్ పోర్ట్ కాపీ తమకు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సోనియమ్మ చాలా అతి తెలివిగా స్పందించింది. తన పాస్ పోర్ట్ కాపీ చాలా సీక్రెట్‌గా వుంచాల్సిన అవసరం వుందని, తన పాస్ పోర్ట్ వివరాలు బయటపడితే తనకు రక్షణకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం వుందని కుంటిసాకు చెబుతూ అమెరికా నోటీసులకు జవాబిచ్చింది. వీపు మీద కొడితే పళ్ళు రాలతాయన్నట్టు తన పాస్ పోర్ట్ కాపీ అమెరికాకి ఇస్తే సెక్యూరిటీకి సంబంధించిన సమస్యలు ఎందుకొస్తాయో సోనియానే చెప్పాలి. మొత్తమ్మీద ఈ ఇటాలియన్ బామ్మకి చట్టం నుంచి తప్పించుకునే తెలివితేటలు బాగానే వున్నాయి.