ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: శంకర్రావు
posted on Apr 8, 2014 @ 3:24PM
ఈసారి ఎన్నికలలో తాను ఇండిపెండెంట్‌గా కంటోన్మెంట్ నియోజకవర్గం బరిలో నిలువనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి.శంకరరావు ప్రకటించారు. వివాదాస్పద వ్యక్తిగా నిలిచిన శంకర్రావుకు ఈసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. ఎంత బాగా సోనియాగాంధీ భజన చేసిన శంకర్రావు పప్పులు ఉడకలేదు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో శంకర్రావు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీద అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. పొన్నాల టిక్కెట్లను అమ్ముకుని తనకు టిక్కెట్ రాకుండా చేశాడని విరుచుకుపడ్డాడు. కేవీపీ రామచంద్రరావు కనుసన్నల్లో టిక్కెట్ల పంపిణీ వ్యవహారం జరగడంతో తనకు ఈసారి టిక్కెట్ రాలేదని శంకర్రావు వాపోతూ చెప్పాడు. టీ కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపు మీద సీబీఐతో విచారణ జరిపించాలని శంకర్రావు కామెడీ డిమాండ్ చేశాడు. తాను కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి వీర విధేయుడినని, కాంగ్రెస్ పార్టీని వీడిపోనని ఆయన ప్రకటించాడు. కాకపోతే ఈసారి ఎన్నికలలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు శంకర్రావు వెల్లడించాడు. జలయజ్ఞంలో జరిగిన అవినీతిపై తాను అలుపులేని పోరాటం చేసినందునే తనమీదక కక్షకట్టినవాళ్ళు తనకు టిక్కెట్ రాకుండా చేశారని ఆయన చెప్పుకొచ్చారు.