పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని చంపి..
posted on Apr 5, 2021 @ 3:22PM
నేటి సమాజంలో ధనార్జన కోసం అన్ని దిక్కు మాలిన పనులు చేస్తున్నారు. అందుకోసం రకరకాల ముసులు వేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా కొంత మంది అయితే కన్నవాళ్ళు అని చూడకుండా వారి ప్రాణాలు తీస్తున్నారు. వృద్దులకు, అర్హులకు నెల గడవడం కోసం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుల కోసం దారుణానికి పాల్పడ్డాడు ఓకే నీచుడు.. అందుకోసం సొంత తండ్రినే ఛంపాడు ఓ కసాయి కొడుకు.
అతనిది పెన్షన్ తీసుకునే వయసు. చెట్టంత కొడుకు వున్నాడు.. కానీ వాడు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగుతూ నిసమీద ఉండేటోడు. ఎప్పుడు తండ్రితో ఆస్తి కోసం.. అతనికి వచ్చే పెన్షన్ డబ్బుల గొడవ పడేవాడు. తాజాగా మద్యం మత్తులో ఎప్పుడు ఉండే గొడవ తండ్రిని కొట్టి చంపే వరకు దారితీసింది. అనంతపురం జిల్లా కూడేరు మండలం కడగళ్లలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు తండ్రినే కొట్టి చంపాడు. గ్రామానికి చెందిన ఓబన్నను ఆయన కొడుకు జయకృష్ణ మద్యం మత్తులో కొట్టి కిందకు తోయడంతో మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో పింఛను డబ్బుల విషయంలో గొడవ జరిగిందని, ఈ క్రమంలో తండ్రిపై జయకృష్ణ దాడి చేశాడని పోలీసులు చెప్పారు. ఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు, జయకృష్ణను కరెంటు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తరచూ మద్యం మత్తులో ఆస్తి విషయంతోపాటు పింఛను డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడని గ్రామస్థులు తెలిపారు.