ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కనుమరుగే: సోము వీర్రాజు
posted on Dec 5, 2020 @ 2:44PM
దేశంలో బీజేపీ మినహా అన్ని పార్టీల్లో కుటుంబ పాలన ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చాక అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ ఇచ్చారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సోము వీర్రాజు.. గత టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. 7 వేల 200 కోట్ల రూపాయలు తీసుకుని చంద్రబాబు.. 4 తాత్కాలిక బిల్డింగులు కట్టారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, టీడీపీ కనుమరుగవుతాయన్న వీర్రాజు.. జనసేన- బీజేపీ, వైసీపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు సోము వీర్రాజు.