మద్యం బాటిల్ లో పాము..
posted on Apr 16, 2021 @ 10:15AM
పాములు పుట్టలో ఉంటాయి. లేదంటే అడవిలో ఉండాయి.. పొలాల్లో ఉంటాయి. మనుషులు ఉన్న చోట కూడా అప్పుడుడప్పుడు దర్శనం ఇస్తుంటాయి. మరి ఎంజాయ్ కోసం, బాధను మరువడం కోసం, రకరకాల సాకులతో తాగుతున్న మందు బాటిల్ లో పాము ప్రత్యేక్షం అయితే. ఆ మందు బాటిల్ ఒకడు తాగితే ఓకే.. పది మంది కలిసి తాగితే, వారికి ప్రాణాలు పొతే, దానికి ఎవరు బాద్యులు. ప్రభుత్వాల, మద్యం వ్యాపారుల. ఒక మద్యం తాగితే పోతారు అని చెప్పిన తాగుతున్న మందుబాబులదేనా. నిజానికి మద్యపానం ప్రాణానికి హానికరం అన్న మాట, ఈ సంఘటన వాళ్ళ రుజువైయిందని చెప్పాలి. ఎనుకటికి ఎవడో జొన్న గింజతో కొడితే చనిపోయాడని చెపితే విన్నాం.. కానీ మన టైం బాగాలేకపోతే డబ్బులు పెట్టి తీసుకున్న మందు బాటిల్ లో పాము ఉంది దాని వాళ్ళ చనిపోతే మన కుటుంబం ఒంటరి అవుతుంది. రోడ్డున పడుతుంది. ఇదంతా ఎందుకు చెపుతున్నారు అనుకుంటున్నారా మీరే చూడండి తెలుస్తుంది ఏం జరిగిందో..
అతని పేరు సురేష్ . అతడు ఒక వ్యవసాయదారుడు. రోజంతా పొలంలో కష్టపడి సాయంత్రం కాస్త మందు తాగడం అనుకున్నాడు. స్థానిక ప్రభుత్వ టాస్మాక్ దుకాణంలో మద్యం బాటిల్ తీసుకుని.. దాహం మీద ఉండడంతో నాలుక లాగుతుందని కంగారు కంగారుగా రెండు పెగ్గులు వేశాడు.. కొంచం మత్తు ఎక్కింది.. మద్యం సీసాను కిందికి మీదికి చూశాడు.
కట్ చేస్తే ఆ అప్పటి వరకు తాను తాగిన మందు సీసాలో పాము పిల్ల ఉంది. ఒక్కసారిగా షాక్ తిన్నాడు.. ఈ విషయం పై టాస్మాక్ సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. అతడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. ప్రాథమిక చికిత్స అందించి జయంకొండం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన తమిళనాడులోని అరియలూరు సుత్తమల్లి గ్రామంలో జరిగింది.