స్మగ్లర్లకు సహకరిస్తోన్న పాక్ ఎయిర్‌లైన్స్..
posted on Aug 1, 2016 @ 9:40AM
పాకిస్థాన్..కరడు గట్టిన ఉగ్రవాదులకు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌కు భూతల స్వర్గం. ప్రపంచంలో పేరు మోసిన కిలాడీలంతా ఆ దేశాన్ని ఒక గెస్ట్‌హౌస్‌లాగా వాడుకుంటూ ఉంటారు. ఆ దేశ ప్రభుత్వం అన్ని రకాల రాచమర్యాదలు చేస్తూ వారి సేవలో తరిస్తోంది. ప్రభుత్వమే ఇలా ఉంటే మేమేం తక్కువ తినలేదంటున్నారు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది. విమానాశ్రయాల్లో మాదకద్రవ్యాలు, బంగారం అక్రమ రవాణా తరలించడం అంత సులభమైన పని కాదు. మూడంచెల భద్రతలో ఎక్కడో ఒక చోట దొరికిపోవడం ఖాయం. అయితే ఎయిర్‌లైన్స్ సిబ్బందే అక్రమ రవాణాకు పాల్పడితే..? లాహోర్ నుంచి దుబాయ్ వెళ్తోన్న విమానంలో పెద్ద ఎత్తున మత్తుపదార్ధాలు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ ఫోర్స్..సదరు విమానం టాయ్‌లెట్‌లో 6 కిలోల హెరాయిన్‌ను గుర్తించింది. దీని విలువ సుమారు ఆరు కోట్లు ఉంటుందని అంచనా. ఈ వ్యవహరంలో ప్రమేయమున్న 12 మంది ఎయిర్‌లైన్స్ సిబ్బందిని అరెస్ట్ చేశారు.