స్మగ్లర్ల అతి తెలివి.. అమాయకులను ఇరికించేస్తోంది!
posted on Jul 28, 2022 @ 2:49PM
స్మగ్లర్లు తెలివి మీరుతున్నారు. నిఘా నేత్రాల కన్ను కప్పి మరీ తమస్మగ్లింగ్ కొనసాగించేందుకు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. వ్యూహాలు పన్నుతున్నారు. దొరికిపోయినా తాము మాత్రం పట్టుబడకుండా అమాయకులను దీనిలో ఇరికిస్తున్నారు. ఇటువంటి ఘటనే జైపూర్ విమానాశ్రయంలో వెలుగు చూసింది.
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా యథేచ్ఛగా గోల్డ్ రవాణా ఎదేచ్చగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు కేజీ బంగారం బిస్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 52.10 లక్షలు ఉండొచ్చునని అంటున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు దుబాయ్ నుంచి జైపూర్ వచ్చిన స్పైస్ జెట్ విమానంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు.
ఆ తనిఖీలో ఓ సీట్ కింద అనుమానాస్పద బ్యాగ్‌లో కేజీ బంగారం బిస్కెట్ కనిపించింది. సీటు నెంబర్ ఆధారంగా ప్రయాణీకుడిని గుర్తించిన పోలీసులు అతడిని విచారించారు. అతడి సమాధానం విని కస్టమ్స్ అధికారులే కంగుతిన్నారు. అసలు విషయమేమిటంటే ఆ ప్రయాణీకుడు దుబాయ్ లో విమానం ఎక్కడానికి ముందు ఒక అగంతకుడు అతడిని కలిశాడు.
ఓ పార్శిల్ ఇచ్చి సీటు కింద పెట్టుకోమని కోరాడు. ఆ పని చేసి పెట్టమంటూ పది వేల రూపాయలు అతడి అక్కౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో విమానయాన సిబ్బంది హస్తం కూడా ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నారు.