బుద్ధిలేని అమ్మాయి.. రూ.కోటి ప్రజాధనం వ్యర్ధం!
posted on Jul 28, 2022 @ 2:28PM
తప్పిపోయిందనుకుని టామీ కోసం ఊరుఊరంతటినీ ఖంగారెత్తించిందో తల్లి.. సాయింత్రానికి ఆ టామీ వొళ్లు విరుచుకుంటూ నాలుగు వీధుల కూడలి స్థంభం వెనకనుంచి వచ్చింది. తిరిగి తిరిగి ఆయాస పడిన వారు దాన్ని కొట్టి చంపాలను కున్నారు. ఎంతయినా పెంచుకున్నది .. కాస్తంత తిండిపెట్టారు. జనం, పోలీసాయన కోపంతో ఊగి పోయారు. కొంత ఇలానే ఉంది సాయి ప్రియ ఉదంతం.
విశాఖపట్నానికి చెందిన 21 ఏళ్ల సాయిప్రియ 2020లో పెళ్లి చేసుకుంది. భర్త శ్రీనివాసరావు హైదరా బాద్‌లో ఒక ఫార్మాకంపెనీలో పనిచేస్తున్నాడు. తమ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవడానికి అతను విశాఖ వెళ్లా డు. ఆరోజు సాయింత్రం అలా బీచ్‌కీ తీసికెళ్లాడు. బీచ్ అనగానే సరదాగా గడపడమే కదా. ఏవో నాలుగు కబుర్లు, రెండు ఐస్క్రీమ్ లతో సాయింత్రం గడిపేయచ్చని, మాట్లాడుకోవచ్చని వాళ్లి ద్దరే వెళ్లారు. కొంత సేపటికి శ్రీనివాస్‌కి ఫోన్ వచ్చి కొద్దిగా అవతలకి నడుస్తూ ఫోన్ మాట్లాడాడు. అయి పోయి వెనక్కి తిరిగి చూస్తే అమ్మడు కనపడలేదు. రాకాసి అల లాక్కెళ్లిందేమో అని భయపడ్డాడు. బీచ్ అంతా కలయ తిరి గాడు. కానీ ఎక్కడా ఆమె జాడ లేదు. అంతే అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు. అంతా వెతికినా వారికీ కనిపించలేదు. ఏకంగా శ్రీనివాస్ నీ కొంతమంది అనుమానించారు.
యావత్ విశాఖ ఖంగారెత్తింది.. ఇలాంటివీ జరుగుతాయా అని శ్రీనివాస్ అత్తింటివారు, స్నేహితులు జల్లెడ పట్టినా ఆ అమ్మాయి చున్నీ కూడా దొరకలేదు. ఇదేం మాయరా నాయనా అని అనుకున్నారు. బాదపడ్డా రు. అంతలో ఒకవేళ నిజంగానే ఏదో పెద్ద అలా సముద్రంలోకి లాక్కెళ్లిందేమోనని సందేహాలు వ్యక్తమ య్యాయి. చాలామంది అదీ జరగవచ్చనుకున్నారు. అంతే వెంటనే భద్రతాదళాలు, హెలి కాప్టర్లతో సిద్ధ మయ్యారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ ఇది మరింత ఆసక్తికర అంశమైంది.
అమ్మాయి దొరకలేదు గాని కోటిరూపాయల ఖర్చు అయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి నుంచి వీడియో కాల్ వచ్చిందని అమ్మాయి తండ్రే పోలీసులకు చెప్పారు. విషయమేమంటే, ఆమెగారికి ఈ పెళ్లి ఇష్టం లేదు. రవి అనే అబ్బాయిని విశాఖలో ప్రేమించేసింది. అతనితో బంగళూరులో ఉంది. అక్కడికి వెళ్లడా నికి పెద్ద స్కెచ్ వేసింది. దానికి బలయింది శ్రీనివాస్, తల్లిదండ్రుల పరువు. ప్రజాధనం కోటి రూపాయ ల ఖర్చు. మరో షాకింగ్ సంగతేమిటే, ఆ రోజు బీచ్‌కి సదరు ప్రేమికుడు కూడా రావడం!