గెలుపు మార్గాలేవీ?.. జగన్ వెతుకులాట!
posted on Dec 15, 2023 @ 3:53PM
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతిపక్షాలు టీడీపీ-జనసేనలు పొత్తుకు సిద్దమై ఉమ్మడి కార్యాచరణతో ప్రజల మధ్యకు వెడుతూ గెలుపు ధీమాతో ఉంటే అధికార వైసీపీ మాత్రం ఓటమి భయంతో బిక్కుబిక్కుమంటోంది. ఇప్పటికే వెలువడిన సర్వేల ఫలితాలు, ప్రజల అసంతృప్తి, వ్యతిరేకత గమనించి ఓటమిని తప్పించుకోవడానికి దారులు వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో మరింత గందరగోళానికి తెరలేపుతున్నాయి.
అంతో ఇంతో ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని మరింత పతనం దిశగా నడిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చేస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయంతో పార్టీలో ఓ విధమైన గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు సహా 11 మంది ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలిగించిన జగన్ ఇప్పుడు ఆ దిశగా రెండో అడుగు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గాలను మార్చేసే ఎమ్మెల్యేల రెండో జాబితా కూడా రెడీ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోండొ జాబితాలో కూడా మంత్రులు సహా 45 మంది ఎమ్మెల్యేలు ఉణ్నారని చెబుతున్నారు. ఇది కాకుండా మూడో జాబితా కూడా ఉంటుందని అంటున్నారు.
మొత్తంమీద 90 మందికి పైగా సిట్టింగులను మార్చేయాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. జగన్ రెడీ చేసిన రెండో జాబితాలో రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ జాబితాలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండో జాబితాలో ఆరుగురు మంత్రులు ఉన్నారంటున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను యలమంచిలికి, అలాగే కొవ్వూరు (ఎస్సీ) ఎమ్మెల్యే, హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం (ఎస్సీ)కి పంపించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అమలాపురం ఎమ్మెల్యే, మంత్రి పినిపె విశ్వరూప్ కు ఈసారి దక్కే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. అమలాపురం నుండి ఎంపీ చింతా అనూరాధను బరిలోకి దించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేశ్, సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబులను కూడా నియోజకవర్గాలు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరి జయరాంను లోక్‌సభ అభ్యర్థిగా దించే అవకాశాలున్నాయంటున్నారు.
అలాగే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని కూడా లోక్ సభకు పంపాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ (ఎస్టీ), యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పి.ఉమాశంకర్ గణేశ్, పత్తిపాడు శాసన సభ్యుడు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, గోపాలపురం నుంచి తలారి వెంకటరావు (ఎస్సీ), తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి (ఎస్సీ), అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు, విజయవాడ సెంట్రల్ శాసన సభ్యుడు మల్లాది విష్ణు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, గూడూరు ఎమ్మెల్యే వి.వరప్రసాదరావులకు కూడా స్థాన చలనం ఉంటుందంటున్నారు. అదే విధంగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, మంత్రాలయం శాసన సభ్యుడు వై.బాలనాగిరెడ్డి, గుంతకల్ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, సత్యవేడు శాసన సభ్యుడు కోనేటి ఆదిమూలం, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, పలమనేరు వెంకటగౌడలను కూడా మార్చే అవకాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక, కాకినాడ ఎంపీ వంగా గీతను ఎమ్మెల్యే పి.దొరబాబు స్థానం పిఠాపురం నుండి పోటీ చేయించనున్నట్లు తెలుస్తుంది.
అంతేకాదు, చింతలపూడి, పోలవరం, ఉంగటూరు, అవనిగడ్డ, పెడన, నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, గుంటూరు వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్, సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె, వేమూరు, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, ప్రత్తిపాడు, జగ్గంపేట, అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, పి.గన్నవరం, రాజమండ్రి సిటీ, తాడేపల్లిగూడెం, ఉండి, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండేపి, మార్కాపురం, నెల్లూరు సిటీ, కావలి, కందుకూరు, గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట, జమ్మలమడుగు, కమలాపురం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, నందికొట్కూరు, హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, కదిరి, సింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఆమదాలవలస, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, గాజువాక, విశాఖ సౌత్, పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, పాడేరులో కూడా అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తుంది.