రోడ్డు ప్రమాదంలో ఎంఎల్ సి షేక్ సబ్జీ దుర్మరణం
posted on Dec 15, 2023 @ 3:03PM
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ జాతీయ రహదారి మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంఎల్ సి షేక్ సబ్జీ దుర్మరణం చెందారు.ఈ ప్రమాదంలో ఆయన గన్ మెన్, కారు డ్రైవర్ తీవ్ర గాయాలకు గురై ఆందోళనకర పరిస్థితులో ఉన్నారు. షేక్ సబ్జీ టీచర్స్ పట్టభధ్రుల నియోజకవర్గం నుంచి పిడిఎఫ్ ఎంల్ సిగా నియామకమయ్యారు. అంగన్ వాడి కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో వాహనం ఎంఎల్ సి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఎల్ సి అక్కడికక్కడే మృతి చెందారు. .ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో సాబ్జీ మరణ వార్తను తెలుసుకున్న జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.సాబ్జీ కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చివరి ఘడియల్లో కూడా సాబ్జీ ప్రజాసేవలోనే కొనియాడారని చెప్పారు. షేక్ సాబ్జీ మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని లోకేశ్ తెలిపారు. శాసనమండలిలో వినిపించే ప్రజల గొంతు మూగబోయిందని చెప్పారు. ఉపాధ్యాయుల హక్కుల పోరాటయోధుడు సాబ్జీకి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ఎక్స్ వేదికగా స్పందించారు.