సీతక్క..సారీ... డాక్టర్ అనసూయ!
posted on Oct 12, 2022 @ 4:22PM
కాలంతో పాటు అన్నీ మారతాయంటారు తత్త్వవేత్తలు. కొన్ని ఊహించని సంఘటనలు ఇలానే జరుగు తాయి. కొన్ని విరుద్ధమవుతాయి. కొందరిలో ఎవరూ ఆలోచించని, భావించని గొప్ప మార్పు వస్తుంది. మరి కొందరిలో తమజీవితం జీవనం గురించి ప్రశ్నతలెత్తుతుంది. గతం వర్తమానం భవిష్యత్ ఒక్కసారిగా మనో ఆకాశంలో జీవితాన్ని చర్చించేట్టు చేస్తుంది. అందుకు ఏదో ఒక సంఘటనో, ఒక సందర్భమో కారణం కావచ్చు. లేదా హఠాత్పరిణామానికి ఓ ఆలోచనే కొత్త మనిషిని చేయవచ్చు. ఏదయినా సంభవమే. ఇలాంటి గొప్ప మార్పు, గొప్ప మనోవికాసానికి ఉదాహరణ సీతక్క.. సారీ.. డి. అనసూయ జీవిత గమనం. ఒకప్పటి సీతక్కకి .. ఇప్పుటి డాక్టర్ డి. అనసూయ కీ ఎంతో తేడా ఉంది.
సీతక్కగా నక్సల్స్‌తో చేతులు కలిపి, అడుగులు వేసి అడవిలో కొంతకాలం గడిపిందామె. అందుక్కార ణా లు వేరు. కానీ ఆ తర్వాత క్రమేపీ ఆమె ఆలోచనా ధోరణి మారింది. జనజీవనస్రవంతిలో కలవాలని మన మధ్యకి వచ్చేశారు. గతాన్ని గురించి ఆమె మళ్లీ ఆలోచించేందుకు ఇష్టపడదామె. వాస్తవాలు గ్రహించి, ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజలతోనే ఉండి వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి పూను కోవాలన్న గట్టినిర్ణయం ఆమెను అటవీప్రాంతాల్లోంచి గ్రామీణ జీవనస్రవంతికి, రాజకీయాల్లోకి నడిపిం చింది.
సీతక్కగా ఆమె జీవితం గురించి తెలుసుకోవడం కంటే ఆమెలో అనేక సంఘర్షణల ఫలితంగా విద్యావం తురాలయి ప్రజాసేవకు దారులు వేసుకున్న వ్యక్తినే అందరూ ఇష్టపడుతున్నారు. డి. అనసూయ సమైక్య ఆంధ్రప్రదేశ్ వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గొట్టి కోయ ప్రజల వెతల గురించి ఆమె చేసిన రీసెర్చ్‌కి ఉస్మాని యా వర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది.
గిరిజనుల సమస్యల పరిష్కారానికి, వారి మంచి జీవితాలు కల్పించాలన్న గొప్పలక్ష్యంతోనే రాజకీయా ల్లో కి వచ్చారు. ఇటీవలి కాలంలో భారీ వర్షాలు,వరదల కారణంగా ములుగు నియోజకవర్గంలో అనేక గ్రామా లు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలి ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కోసం నిత్యావసర సరుకులు, ఆహారం పపంపిణీ చేయడానికి ములుగు ఎమ్మెల్యేగా సీతక్క చేసిన సాయం మరువరానిది. రెండు వాహనాల్లో ఆహా ర పధార్థాలను నింపి, పేదలకు పంపిణీ చేయడానికి పంపారు. కొన్ని గ్రామాల్లో తానే దగ్గరుండి ఆహా రం అందించారు. అవకాశం ఉన్న వారందరూ సాయం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కేవలం ప్రకటనలక పరిమితం కాకుండా ఆమె స్వయంగా సహాయక కార్యక్రమా్లో పాల్గొని ఇతరు లకు మార్గదర్శకురాలయ్యారు. ములుగు ప్రాంతంలో దాదాపు 52 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కకు న్నాయి. ఆ గ్రామాల ప్రజ లకు సరకులు పంపిణీ చేయడం శ్లాఘనీయం. అంతేకాదు, ములుగు జిల్లా శనిగకుంట లో అగ్నిప్రమాదానికి గురై 24ఇళ్లు దగ్దమయినపుడు అక్కడ నివాసముంటున్న గిరిజన కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడటంతో స్థానిక ఎమ్మెల్యే గా సీతక్క, టీఆర్‌ఎస్ నేత లక్ష్మణబాబుతో పాటు స్వచ్చంద సంస్థలు విరాళాలు సేకరించి వారిని ఆర్ధిక సాయం అందించారు.
ఆమెలో వచ్చిన ఈ సంపూర్ణ మార్పు గురించి ఆమె మాటల్లోనే ... బాల్యంలో నేను నక్సలైట్ అవుతానని అనుకోలేదు, నక్సలైట్ అయ్యాక లాయర్ అవుతానని అనుకోలేదు, లాయర్ అయ్యాక ఎమ్మెల్యే అవుతా నని అస్సలు అనుకోలేదు, ఎమ్మెల్యే అయ్యాక నా పీహెచ్.డి పూర్తి చేస్తాననీ అనుకోలేదు. ఇప్పుడు నన్ను డాక్టర్ అనసూయ అని పిలవవచ్చు.