డాక్టర్ నమ్రతపై మరో కేసు నమోదు.. నేడు 9 మంది అరెస్టు
posted on Aug 6, 2025 @ 7:21PM
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత కేసులో అక్రమాలు ఒక్కొ క్కటిగా బయటప డుతున్నాయి. ఇప్పుడు తాజాగా డాక్టర్ నమ్రతపై మరో కేసు నమోదు అయింది... ఈ నమ్రత అలాంటి ఇలాంటి లేడీ డాక్టర్ కాదు... ఒకవైపు పిల్లల్ని అమ్మే గ్యాంగ్ తో సంబం ధాలు పెట్టుకోవ డమే కాకుండా మరోవైపు గాంధీ హాస్పిటల్ లో పని చేస్తున్న అనస్థీ షియా డాక్టర్ ను గుప్పిట్లో పెట్టుకుంది... పేదవారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని... వారికి డబ్బు ఆశ చూపించి... పిల్లల్ని కొనుగోలు చేసింది. అంతటితో ఆగలేదండోయ్ ఈ లేడీ కిలాడీ డాక్టర్... ఏకంగా సికింద్రా బాద్ కు చెందిన ప్రముఖ గైనకా లజిస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో కన్సల్టెంట్ గా పని చేస్తున్న వైద్యురాలి లెటర్ హెడ్ లను వినియోగించింది... తన వద్దకు వచ్చిన.. పేషెంట్లకు ఆ లెటర్ హెడ్ మీద మందులు, ఇంజక్షన్లు రాసి ఇచ్చేది... అయితే తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ లను చూసి వైద్యాలు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు.
నా లెటర్ హెడ్ లను ఎటువంటి అనుమతి లేకుండా డాక్టర్ నమ్రత ఉపయోగించిందని ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గోపాలపురం పోలీసులు నమ్రతపై మరో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు సృష్టి టెస్టిట్యూబ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఈరోజు పోలీసులు ఈ కేసులో మరో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టుల పర్వం 18 కి చేరుకుంది. ఘటన వెలుగులోకి రావడంతో... విదేశాలకు పారిపో యేందుకు ప్రయ త్నించిన లేడీ డాక్టర్ విద్యులత తో పాటు మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన వీరందరినీ వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. మరికాసేపట్లో ఈ తొమ్మిది మందిని కోర్టులో హాజరుపర చానున్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతను మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని భావించిన పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు....86 మంది సరోగసీ దంపతుల వివరాలు సేకరించా లని.... అలాగే సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డ నమ్రత పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై విచారించాలని... అందుకే మరో మారు నమ్రతను కస్టడీలోకి తీసు కునేందుకు అను మతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.