భారత్‌కు ట్రంప్ మరో బిగ్ షాక్
posted on Aug 6, 2025 @ 8:12PM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌కు మరో బిగ్ షాక్ ఇచ్చారు. మరో 25 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన మన దేశంపై 25 శాతం సుంకాలు విధించారు. దీనికి అదనంగా సుంకాలు ఉంటాయిని ఇటీవల ప్రకటించారు. ఈక్రమంలో ఇప్పటికే 25 శాతం సుంకాలను విధించి.. దానిని ఇప్పుడు 50 శాతానికి విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు.
రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హూస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పరిణామాల తర్వాత కూడా.. రష్యా నుంచి ఇంకా ఆయిల్ కొనుగోలు చేస్తున్నందునే ఆయన మరో 25 శాతం టారిఫ్‌తో తాజా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి చేరాయి. తాజా సుంకాల పెంపుపై అర్ధరాత్రి తర్వాత ఆయన అధికారికంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది.