ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు..కెమిస్ట్రీ బాగాలేదని విడాకులు : వెంకయ్యనాయుడు
posted on Aug 6, 2025 @ 7:10PM
దేశంలో ఉండే రాజకీయాలు, రాష్ట్రంలో ఉండే పరిణమాలపై ప్రజలు ఆలోచన చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. విజయవాడలో వల్లూరు శ్రీమన్నారాయణ అభినంద సభలో పాల్గోన్నారు. నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుందని వెంకయ్య పేర్కొన్నారు. కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయన్నారు. ఇటీవల ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు..కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారని మాజీ ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఇప్పుడు ఏ నాయకులు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. చిన్న పిల్లలకు డైపర్లు మార్చినట్లు పార్టీలు మారుతున్నారని తెలిపారు.స్నేహం ఎలా ఉండాలి అంటే కంటికి కనురెప్ప లా ఉండాలని..శ్రీమన్నారాయణ స్నేహానికి పెట్టింది పేరు ఆయన అన్నారు. అదే విధంగా శ్రీమన్నారాయణ కూడా తను నమ్మిన పార్టీ కోసం పని చేశారు.. ఎటువంటి పదవులు ఆశించకుండా పని చేశారని తెలిపారు.