ఫామ్ లోకి వచ్చిన శర్మ, సూర్య... నెదర్లాండ్స్ పై భారత్ విజయం
posted on Oct 27, 2022 @ 4:04PM
ఇద్దరు సూపర్ స్టార్స్ రెచ్చిపోయి ఆడితే ఎలా ఉంటుందో నెదర్లాండ్ ప్లేయర్లకు, ప్రేఓకులకు తెలి సింది. చాలా రోజుల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ తన బ్యాటింగ్ పటిమను ప్రదర్శించాడు. మొన్న పాకిస్తాన్తో తలపడిన మ్యాచ్ లో త్వరలోనే పెవిలియన్ దారిపట్టిన కెప్టెన్ కొంత నిరాశ పరిచాడు. కానీ గురువారం నెదర్లాండ్ తో తలపడిన మ్యాచ్ లో తన పాత ఫామ్ లోకి తిరిగి వచ్చానని అభిమానులకు తన అర్ధసెంచరీ ఢమాకాతో తెలియజేశాడు. మరో వంక కింగ్ కోహ్లీ మళ్లీ తన డాషింగ్ ప్లేను ప్రదర్శించి మరో అర్ధ సెంచరీ చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ తన ఫామ్‌పై విమర్శలు చేసేవారికి ధీటుగా బదులి చ్చాడు. కెప్టెన్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేసి రాణించాడు. విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో కూడా కింగ్ కోహ్లీ 44 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్ 56 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై గెలిచింది. ముందు బ్యాట్ చేసిన భారత్ 2 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 179 పరుగులు చేయగా, నెదర్లాండ్స్ 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరాశపరిచిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. 25 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్ ల్లో భాగంగా గత వారం పాక్ తో తలపడిన టీమ్ నే నెదర్లాండ్ తో తలపడేందుకు దించారు. పాక్ తో జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకూ ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో భారత్ కు ఘన విజయాన్ని చ్చిన కింగ్ కోహ్లీకి నెదర్లాండ్ మ్యాచ్ కి రెస్ట్ ఇస్తారనే అనుకున్నారు. కానీ కోహ్లీ జట్టులో ఉండడమే కాకుండా మళ్లీ అదే ధాటి ప్రదర్శించి 44 పరుగుల చేయడంలో ప్రేక్షకులను అలరించాడు. కాగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా రెచ్చిపోయి ఆడటం భారత్ జట్టు వీరాభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
గత మ్యాచ్ లో ఇద్దరి వైఫల్యం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. కాగా, గురు వారం మ్యాచ్ లో ఓపెనర్ కె.ఎల్. రాహుల్ ఊహించనివిధంగా వెనుదిరిగాడు. తన వ్యక్తిగత స్కోర్ 9 పరుగుల వద్ద లెగ్ బిఫోర్ అయ్యాడు. అయితే ఏ మాత్రం రివ్యూ కోసం ఆగకుండా వెళిపోవడమే పెద్ద పొరపాటయిందనాలి. నిజానికి తర్వాతి క్షణంలో థర్డ్ అంపైర్ రివ్యూనిపరీక్షించగా అతను నాట్ అవుట్ అని తేలింది. కానీ అప్పటికే రాహుల్ వెళిపోయాడు. ఆ విధంగా రాహుల్ మంచి స్కోర్ చేసే అవకాశం కోల్పోయాడనాలి. నెదర్లాండ్ బౌలర్లను అతను సునాయాసంగా ఎదుర్కొనగలడన్న నమ్మకం కెప్టెన్ శర్మకీ ఉంది గనుకనే రాహుల్ అలా వెళిపోవడం శర్మను ఆశ్చర్యపరిచింది.
180 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ కు ఓపెనర్లు విక్రమ్ జిత్ సింగ్, మాక్స్ డౌడ్ నిరాశ పరిచారు. వారిద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. విక్రమ్ కేవలం ఒక్క పరుగు తీసి భువనేశ్వర్ కి దొరికి పోయాడు. అలాగే డౌడ్ కూడా 16 పరుగులు మించి చేయలేకపోయాడు. లెఫ్టీ అక్షర్ పటేల్కి చిక్కి పెవిలి యన్ దారి పట్టాడు. చూస్తుండగానే భారత్ భౌలర్ల ధాటికి నెదర్లాండ్ బ్యాటర్లు క్యూ కట్టడంతో పది ఓవర్లకు 70 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.
18వ ఓవర్ చివరికి ఎట్టకేలకు వంద పరుగులు దాటింది. కానీ అప్పటికే 8 వికెట్లు కోల్పోయి విజయా వకాశాలు కోల్పోయింది. భారత్ యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ 18 వ ఓవర్లో చివరి రెండు బంతుల్లో రెండు వికెట్ల తీశాడు. దీంతో 20వ ఓవర్లో హ్యాట్రిక్ సాధిస్తాడని మళ్లీ అతన్నే కెప్టెన్ బౌలింగ్ కి పిలిచాడు. కానీ హాట్రిక్ సాధించలేకపోయాడు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో అత్యధికంగా టిమ్ ప్రింగ్లే 20 పరుగులు, షారి జ్ అహ్మద్ 16 పరుగులు చేశారు. షారిజ్, మెకరిన్ అజేయంగా నిలిచారు.