సెప్టెంబర్ 17.. ఒక్కో పార్టీ ఒక్కోలా
posted on Sep 17, 2016 @ 12:57PM
సెప్టెంబర్ 17 ఈరోజు తెలంగాణ విమోచ దినమా..లేక విలీనమా అన్న సందేహం ఇప్పటి నుండి కాదు ఎప్పటినుండో అందరిలో మెదిలే సమస్యనే. అయితే ఈ రోజును పలు రాజకీయ పార్టీలు తమకు నచ్చిన విధంగా జరుపుకుంటున్నాయి. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు ఈరోజును తెలంగాణ విలీన దినోత్సవంగా జరుపుకున్నారు. సెప్టెంబర్ 17 రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రజాస్వామ్యంలోకి వచ్చిన రోజని.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా తాము అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవం జరిపిస్తామని ఏనాడూ చెప్పలేదని నాయిని అన్నారు.
ఇక భారతీయ జనతాపార్టీ (బీజేపీ), టీడీపీ నేతలు ఈరోజును తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనూ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్నారు. టీటీడీపీ నేత ఎల్.రమణ జాతీయ పతాకం ఆవిష్కరించారు.