మరోసారి చంద్రబాబు ఆగ్రహానికి గురైన అధికారులు..
posted on Sep 17, 2016 @ 1:14PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ అధికారులపై మండిపడటం కామన్. ఈసారి ఆయన ఆగ్రహానికి మరోసారి బుక్కయ్యారు ప్రభుత్వ అధికారులు. అమరావతి నుంచి ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ది శాఖల అధికారులు, జిల్లాల యంత్రాంగం, గ్రామ సర్పంచులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లో వాపిస్తోన్న అంటువాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం క్షీణిస్తోంటే సంబంధిత అధికారులు కట్టుకథలు చెప్పి తప్పించుకోవద్దని అన్నారు. ప్రజలు డెంగ్యూతో బాధపడుతోంటే అధికారుల్లో బాధ ఉండదా? అని ప్రశ్నించారు. అధికారి హోదాలో ఉన్నవారు తమ ఇంట్లో వ్యక్తులనయినా, ఊరిలో వారినైనా ఒక్కటిగానే చూడాలని చంద్రబాబు అన్నారు. అటువంటప్పుడే ప్రజలు అధికారులు, సిబ్బంది నుంచి మంచి సేవలు అందుకుంటారని హితవు పలికారు. ఇక పై ప్రతి శనివారం ఆరోగ్య దినంగా పాటించాలని చంద్రబాబు ఆదేశించారు.