మోడీ పుట్టినరోజు.. తల్లి అశీర్వాదం..
posted on Sep 17, 2016 @ 12:29PM
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు 66 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆయనకు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోడీ మాత్రం ఉదయాన్నే తన తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని తన తల్లి హీరాబెన్‌ను కలిసి ఆమె పాదాలకు నమస్కారం చేసి ఆశ్వీరాదం తీసుకున్నారు. ఇంకా ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి మరింత సేవ చేయాలని ప్రార్థిస్తున్నట్లు పలువురు ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు శుభాకాంక్షలు తెలపడానికి నరేంద్రమోదీ యాప్ లో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ విభాగం కేటాయించారు. ఈ విభాగం ద్వారా దేశ పౌరులు ఎవరైనా సరే తమ స్మార్ట్ ఫోన్ నుంచి ప్రధాని నరేంద్రమోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు.