సీమాంద్రలో మిన్నంటిన ఆందోళనలు
posted on Dec 7, 2013 6:54AM
రాష్ట్ర విభజన నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా లభిచడంతో సీమాంద్రజిల్లాలు భగ్గుమన్నాయి. ఏక పక్షంగా జరిగిన ఈ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ టిడిపి, వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఈ మేరకు అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సీమాంద్ర జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరింగింది. అయితే ఈ రోజు కూడా బంద్‌కు పిలుపునివ్వడంతొ పదమూడు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.
ప్రజలు స్వచ్చందంగా బంద్‌కు సహకరించారు. షాపులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. పార్టీలు ప్రజాసంఘాల చేపట్టిన కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్ని నిరసన తెలిపారు. చాలాచోట్ల సోనియా గాందీ, సుశీల్‌కుమార్ షిండే, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు.