సమైక్య ఉద్యమానికి అఖిలేష్ మద్దతు
posted on Dec 7, 2013 6:44AM
కేంద్ర కేభినేట్ నిర్ణయం నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తుతుండగా జాతీయ స్థాయిలో కూడా సమైక్యాంద్రకు మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే పలు పార్టీలు విభజనకు తాము వ్యతిరేఖమని ప్రకటించగా ఇప్పుడు తాజాగా సమాజ్‌వాది పార్టీ నాయకుడు యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా తన ఆంద్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకమని ప్రకటించారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త మద్దతు కూడగడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం లక్నోలో అఖిలేష్‌ను కలుసుకున్నారు. సమైక్య ఉద్యమంలో తమకు అండగా నిలవాలి ఆయన్ను జగన్ కోరారు. అఖిలేష్ కూడా అందుకు సానుకూలంగా స్పందించారు. విభజన బిల్లును పార్లమెంట్‌లో అడ్డుకుంటామని ప్రకటించారు.