మరోసారి రాజీ'డ్రామా'

 

రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర కేభినెట్‌ నిర్ణయం నేపధ్యంలో సీమాంద్ర కాంగ్రెస్‌ నేతలు మరోసారి రాజీనామ డ్రామాకు సిద్దపడుతున్నారు. ఇప్పటికే ఈ నేతలు స్పీకరుకు రాజీనామా లేఖలు సమర్సించగా వాటిన ఆయన తిరస్కరించారు. అయితే ఇప్పుడు మరోసారి పార్లమెంట్‌ సభలో సభాపతికి రాజీనామ లేఖలు అందించాలని భావిస్తున్నారట.

ఇందులో కేంద్రమంత్రులు పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, చిరంజీవి, పురంధేశ్వరి తో పాటు ఎంపిలు లగడపాటి, హర్షకుమార్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్‌, సబ్బంహరి, రాయపాటి సాంబశివరావులు ఉన్నారు. అయితే ఈసారైనా ఈ నాయకులు రాజీనామాలు ఆమోదింప చేసుకుంటారా లేక మరోసారి అదే డ్రామా ఆడుతారా అన్న అనుమానం ప్రజల్లో ఉంది.


తాము కోరినట్టు సమైక్యా రాష్ట్రంగా కోనసాగించకపోయినా తప్పని పరిస్థితుల్లో తాము చెప్పినట్టుగా భద్రాచలాన్ని సీమాంద్రలో కలపటం, హైదరాబాద్‌ను యూటి చేయటం లాంటి ప్రతిపాదనలను కూడా పట్టించుకోకపోవడంతో సీమాంద్ర నాయకులు మనస్తాపానికి గురైనట్టుగా సమాచారం.