సీమాంద్ర బంద్‌

 

పది జిల్లాతతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ కేంద్ర కేబినేట్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంద్ర భగ్గుమంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో పాటు, ప్రజాసంఘాలు బంద్‌కు పిలుపునివ్వగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.


కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా టిడిపి 48 గంటల బంద్‌కు పిలుపునివ్వగా, వైయస్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా బంద్‌కు పిలుపునిచ్చింది. మరోవైపు ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బంద్‌కు పిలుపునిచ్చారు.