మరోసారి అన్నా దీక్ష

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆగమేగాల మీద చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం జన్‌లోక్‌పాల్‌ బిల్లు విషయంలో మాత్రం అంత త్వరగా స్పందించకపోవటం పై అన్నా హజరే ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్ లోక్‌పాల్ కోసం మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్ధి వేదికగా మరోసారి ఉద్యమించేం దుకు అన్నా హజారే సమాయత్తమయ్యారు.

ఈ నెల 10 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు అన్నాహజరే ప్రకటించారు . ప్రభుత్వం ఈసారి కూడా జన్ లోక్‌పాల్ బిల్లు తీసుకురాకపోతే పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజు నుంచే దీక్ష చేపడతానని ప్రజలకు మాటిచ్చానని అందుకే దీక్ష చేపడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.

అయితే గతంలోనే దీక్ష చేయాలని భావించినా తనకు జరిగిన శస్త్రచికిత్స నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. అలాగే తొలుత ప్రకటించిన దీక్షా వేదిక ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌కు బదులు సొంతూరు రాలేగావ్ సిద్ధిలో దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు వివరించారు.