సేవ్ ఆంద్రప్రదేశ్ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
posted on Sep 6, 2013 @ 12:58PM
విభజనకు నిరసనగా సమైక్యవాదులు హైదరాబాద్‌లో తలపెట్టిన సేవ్ ఆంద్రప్రదేశ్ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసులు అనుమతి ఇవ్వడాన్ని సమర్థించిన కోర్టు షరుతులను ఖచ్చితంగా పాటించాలంటూ ఎపిఎన్జీవో నేతలకు సూచించింది. కేవలం గుర్తింపు కార్డులు కలిగిన ఉద్యోగులు మాత్రమే సభకు రావాలని, ప్రైవేట్ ఉద్యోగులు విద్యార్థులు సభకు రాకూడదని తేల్చి చెప్పింది.
ఇప్పటికే పలువురు రాజకీయనాయకులు సభకు సంఘీభావం తెలుపగా మరికొంత మంది సభకు హాజరవుతామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఉద్యోగస్థులు కానివారిని ఎవరైనా సరే సభకు అనుమతించ వద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించింది.