దినేష్ రెడ్డి అస్తులపై సిబిఐ విచారణ
posted on Sep 6, 2013 @ 12:48PM
నియామకం నుంచే వివాదాస్పదం అవుతున్న డిజిపి దినేష్‌రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. తన చర్యలు సీమాంద్ర వాసులకు అనుకూలంగా ఉన్నాయంటూ తెలంగాణ వాదులు విమర్శిస్తున్న సమయంలో ఇప్పుడు మరో వివాదం కూడా ఆయన్ను చుట్టుముట్టింది. తనను కావాలనే డిజిపి వేదిస్తున్నారంటూ ఆరోపించిన శంకరావు. ఆయన ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించారని శంకర్రావు విమర్శించారు. దీనికి తోడు ఐఎఎస్ అధికారి ఉమేష్‌కుమార్ కూడా దినేష్ రెడ్డి ఆస్తులపై విచారణ కోరడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది. ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోక తప్పందటూ వ్యాఖ్యానించిన కోర్టు డిజిపి ఆసత్తులపై సిబిఐ విచారణకు ఆదేశించింది.