మరోసారి సరితా నాయర్ సంచలన వ్యాఖ్యలు.. నన్ను వాడుకున్నారు...
posted on May 12, 2016 @ 10:14AM
కేరళ సోలార్ స్కాంలో నిందితురాలైన సరితా నాయర్ ఇప్పటికే ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఆయన కొడుకుపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సరితా నాయర్. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో కాంగ్రెస్ పెద్దలు తనను ఒక పావులా వాడుకున్నారని, కొచ్చిన్ పోర్టు ట్రస్టుకు చెందిన ఒక భూమి డీల్‌లో తాను మధ్యవర్తిగా కూడా వ్యవహరించానని చెప్పింది. అంతేకాదు కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ఆయన కొడుకు, కొందరు కేబినెట్ మంత్రులపై తన ఆరోపణలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను ఆమె విచారణ కమిషన్‌కు సమర్పించింది.
అంతేకాదు ఇంకా ఆమె రెండు పైన్ డ్రైవ్ లు, కొన్ని పత్రాలను కమిషన్ కు ఇచ్చానని.. తాను రాసిన లేఖలోని అంశాలకు, కొందరు కాంగ్రెస్ పెద్దల పేర్లు బయటపెడుతూ ఏషియా నెట్ చానల్ ప్రసారం చేసిన కథనానికి అవి ఆధారాలని సరితా నాయర్ చెప్పింది. శుక్రవారం మరికొన్ని ఆధారాలు సమర్పిస్తానని మరో బాంబు పేల్చింది. కాగా గతంలో తాను రాసిన లేఖలో ఊమెన్ చాందీ, ఆమె కొడుకు తనని లైంగికంగా వేధించారని తెలపిన సంగతి విదితమే. మరి ఇప్పుడు దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.