కేసీఆర్ ని ట్వీట్టర్లో ప్రశంసించిన మోడీ.. చంద్రబాబు ఎన్నిసార్లు కలిసినా.. ?
posted on May 11, 2016 @ 6:37PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రధాని మోడీ సైతం పొగిడేశారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి చర్చించారు. అయితే వీటన్నింటిలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరధ పథకం మోడీకి బాగా నచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ మిషన్ కాకతీయ గురించి ట్వీట్లు చేసి కేసీఆర్ ను ప్రశసించారు.
ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికి ఎన్నోసార్లు ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితి గురించి చర్చించినా..ఏనాడు ఇలా ట్వీట్ చేయలేదు.. కానీ కేసీఆర్ కలిసింది చాలా అంటే చాలా తక్కువ సార్లు కలిసినా ట్వీట్ చేయడం ఆశ్చర్యం అని అనుకుంటున్నారు. మొత్తానికి కేసీఆర్ మోడీని కూడా ఇంప్రెస్ చేశారన్నమాట.