పబ్లిక్ టాయిలెట్‌కి శంఖంటైల్స్...ఇదేం పైత్యం?
posted on Oct 6, 2022 @ 4:55PM
భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం అనేవి దేశాన్ని ఒక్కటిగా పట్టి ఉంచుతున్నాయి. కానీ పరిస్థి తులు రాజకీయపరిణామాలు వాటికి అర్ధాల్ని మార్చేస్తోన్నాయి. ఇది చాలా ప్రమాదకరమని సామాజిక శాస్త్రవేత్తలు, మతప్రచారకులు ప్రభుత్వాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ మతాలపట్ల నమ్మకాల పట్ల దుష్ప్రచారం జరుగుతూనే ఉంది. వ్యతిరేకతకు హద్దులేకుండా పోతోంది. తిట్టుకోవడంతో ఆగకుం డా ఏకంగా దేవతల బొమ్మలు, ముద్రికలను అవమానిస్తున్నారు.
భీమవరం గొల్లవానితిప్ప గ్రామ పంచాయతీ మరుగుదొడ్ల నిర్మాణంలో హిందూ ధర్మాన్ని ఘోరంగా కించ పరిచారు. మరుగుదొడ్లు మొత్తం ఓంకారం, శంఖం, గద, దీపాలతో నిండిన టైల్స్ అతికించారు. ఇది కావాలని చేశారా, పొరపాటా అన్నది తేలాలి. పొరపాటున చేయడానికి ఏదో ఒకటి అరా కాదు. గోడంతా ముద్రికల తోటి టైల్స్ ఏర్పాటు చేయడం పొరపాటు ఎలా అవుతుంది. ఇతర మతస్తుల నమ్మకాన్ని దూషించడం, గొడవలకు దారితీసేలా ఉసిగొల్పడం పనిగట్టుకుని చేసినట్టే ఉంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతపరమైన దాడులు, విభేదాలు పెచ్చుమీరుతున్నా యన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇతర మతస్తుల పట్ల సామరస్య భావనతో మెలగాలని అంటూనే విభేదాలు సృష్టించే ఆగ్రహం కలిగించే ఉపన్యాసాలు, ప్రచారాలు మరింత పెరిగాయన్నది విప క్షా ల మాట. రాజకీయాలు ఎలా ఉన్నా, పాలనాపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ప్పటికీ ఈ తరహా విభేదాలు దేశంలో పరమత సహనాన్ని పరీక్షిస్తుంది. విభేదాలు దారుణాలకు దారి తీస్తాయి. ఇప్పటికే బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ తీరు పట్ల ఎంఐఎం వంటి పార్టీలు మండిపడుతున్నాయి.