అంతుచిక్కని రోగం.. రాలుతున్న గిరిజనం
posted on Oct 6, 2022 @ 5:30PM
అంతుచిక్కని వ్యాధితో బస్తర్ డివిజన్ లోని సుక్మాన్ జిల్లా పర్దిలో రేగడ గట్ట,రంగిగుట్ట ప్రాంతాలలోని గిరి జన ప్రాంతాలు చత్తీస్ఘడ్ ప్రాంతం లో జరగడం అటు గిరిజనులను ప్రభుత్వ అధికారులను తీవ్ర ఆం దోళనకు గురిచేస్తోంది. ఈ అంశాన్ని ఆదిలాబాద్లో బస్తర్డివిజన్కు చెందినా ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డి.రాజన్ వెల్లడించారు. సహజంగా ఈ కాలం లో వచ్చే వ్యాధులు చాలా ప్రాంతాలాలో విస్తరిస్తా యి. ఈకారణంగా అంతుచిక్కని వ్యాధితో మరణిస్తున్నారని రాజన్ వివరించారు. ఈమేరకు ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు అందిన విషయాన్ని రాజన్ దృవీకరించారు.
కాళ్ళు,చేతులలో వాపులు, కడుపు నొప్పి, విరేచనాలు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ బస్తర్ డివిజన్ లోని సుక్మా గ్రామం పరిధిలో అక్కడి గిరిజన గ్రామాలు దూరంగా విసిరేసి నట్లు ఉంటుందని సుక్మా జిల్లాలోని రేగడ గట్ట, రంగిగట్ట ప్రాంతాలలో చోటు చేసుకుందని అధి కారులు వెల్లడించారు.
ఆయా గిరిజన ప్రాంతాలాలో సరైన వైద్యసదుపాయాలు లేక పోవడం ప్రాధాన కారణంగా పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు సరైన రోడ్లనిర్మాణం లేకపోవడం మరో కారణంగా అధికారులు తెలిపారు. అయా గ్రామాలకు సమీపంలో నీటి సదుపాయం కూడా లేదని, ఆ గ్రామాలలో దోమతెరలు కూడా లేవన్న విషయాన్ని అధికారులు గమనించారు. గతంలో రేగడగుట్టలో ఇదే పరిస్థితి వచ్చిందని అప్పుడు అధి కార యంత్రాంగం సరిగా స్పందిన్చాలేదాని ఇలాంటి సమస్య వస్తే ఎలాస్పందిన్చాలన్న అంశం పై సన్నద్ధం కాక పోవడం పై స్థానిక గిరిజనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకూ అంతుచిక్కని వ్యాధితో ఎంతమంది మరణించారు? అన్న సమగ్ర సమాచారం అధికా రుల వద్ద లేకపోవడం గమనార్హం. కాగా, గిరిజనం మరనిస్తున్నారన్న ఫిర్యాదు అందిన తరువాతే చర్యలకు ఉపక్రమించడం అనారోగ్యం తో వ్యాధి బారిన పడిన వారికి అందరికీ చికిత్చ చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జరీ చేయడం గమనార్హం. అనారోగ్యంతో బాధ పడుతున్న వారి సంఖ్యసమాచారం సేకరించా లని ఎందుకు మరణిస్తున్నారో కూడా సమాచారం తెలుసుకోవాలని స్థానిక వైద్యసిబ్బందికి ఆదేశాలు జారే చేయడం పట్ల గిరిజనులు ప్రభుత్వ అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని. గిరిజనం వాపోతు న్నారు.
ఫిర్యాదు తరువాతే ఇంకా ఇప్పటికీ సమగ్ర సమాచారాం రాబట్టలేదని అధికారులు అందం పట్ల ఆరోగ్య శాఖ ప్రజా ఆరోగ్యానికి ఎంత బాద్యుతాయుతంగా వ్యవరిస్తోందని అనడానికి నిలువెత్తు నిదర్శనం గా నిలుస్తుందని గిరిజనులు అంటున్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది తూతూ మం త్రంగా చర్యలు చెప్పడ్డం అదే పనిగా తమకు శాశ్వత ప్రాతిపదికన ఆసుపత్రి నిర్మించాలన్న తమ డిమాండ్ ను పూర్తిగా పక్కకు పెట్టారని. ఓట్ల కోసం వచ్చే నాయకులు సైతం తమ సమస్య పరిష్కారానికి మరణాలకు కారణం ఏమిటి అన్న అంశం పై స్పందించలేదని గిరిజనం గగ్గోలు పెడుతు న్నారు.