రచ్చ రచ్చైన... రేఖ, సంజయ్ దత్ ల రహస్య వివాహం!
posted on Mar 6, 2017 @ 11:01AM
మందు తాగితే మత్తొస్తుంది. కాని, మర్నాడు హ్యాంగోవర్ కూడా వస్తుంది! సినిమా వాళ్ల పరిస్థితి కూడా అంతే! వాళ్లకు గ్లామర్ తో పాటూ బోలెడంత పేరొస్తుంది! కాని, అదే గ్లామర్ దెబ్బకు గాసిప్స్ కూడా పుట్టుకొస్తాయి! హ్యాంగోవర్ లాగే గాసిప్స్ కూడా రాత్రి పడుకుని పొ్ద్దున్నలేవగానే మైండ్ దిమ్మతిరిగిపోయేలా చేస్తుంటాయి! ఇక సదరు సినిమా సెలబ్రిటీలు రేఖా, సంజయ్ దత్ లాంటి లెజెండ్రీ కాంట్రవర్సియల్ వ్యక్తులైతే చెప్పేదేముంది? వాళ్ల మీదొచ్చిన గాసిప్స్ మంటల్లా పాకేస్తాయి...
రేఖ బాలీవుడ్లో ఇప్పుడున్న వారిలో అత్యంత సీనియర్. కాని, ఆమె చుట్టూ గాసిప్స్ ఎప్పుడూ వుంటూనే వుంటాయి. ఆమె యంగ్ డేస్ లో అమితాబ్ తో ఎఫైర్ అంటూ పేజీలకు పేజీలు రాశారు పేపర్ల వారు. ఇప్పటికీ వారిద్దరూ ఒకచోటికి వస్తే కెమెరాలు అస్సలు ఊరుకోవు. కాకపోతే, పాపం రేఖాని ఇంత లేటు వయస్సులో కూడా రూమర్లు వదిలిపెట్టడం లేదు. ఆమెను మరో హీరోతో లింక్ చేసేశాయి రీసెంట్ గా! అతను మరెవరో కాదు వివాదాస్పద మున్నాభాయ్ సంజయ్ దత్!
రేఖ, సంజయ్ దత్ లకు రహస్యంగా పెళ్లైందనీ, అందుకే, ఆమె ఇప్పటికీ పాపిట్లో కుంకుమ ధరిస్తుందనీ పుకార్లు పుట్టాయి వున్నట్టుండీ! దీనికి ఆధారంగా గాసిప్ గాళ్లు ఒక పుస్తకం పేరు చెప్పారు. రేఖ ది అన్టోల్డ్ స్టోరీ అనే బుక్ ని పోయిన సంవత్సరం రాశాడు యాసిర్ ఉస్మాన్. దాంట్లో ఈ విషయం వుందని ప్రచారం చేశారు! కాని, అందరికీ అనుమానం కలిగించిన విషయం ఎప్పుడో లాస్ట్ ఇయర్ విడుదలైన బుక్ లోని విషయం ఇప్పుడెందుకు బయటకొచ్చిందని! అయినా కూడా రేఖ, సంజయ్ దత్ సీక్రెట్ మ్యారేజ్ గోల పెద్దగా రచ్చగా మారిపోయింది!
ఊరికే గాలికి పుట్టిన గాసిప్ బాధ భరించలేక రేఖ ది అన్టోల్డ్ స్టోరి పుస్తకం రాసిన యాసిర్ ఉస్మానే అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. తన పుస్తకంలో తాను రేఖ, సంజయ్ దత్ పెళ్లి చేసుకున్నారని రాయలేదని ఆయన అన్నాడు. కాకపోతే, వారిద్దరూ 1984లో కలిసి ఒక సినిమా చేశారు. అప్పుడు ఇద్దరికీ ఎఫైర్ వుందని ఘాటు గాసిప్స్ వచ్చాయి. అవ్వి ఎంతగా ముదిరిపోయాయంటే రేఖ సంజయ్ ని సీక్రెట్ గా పెళ్లాడిందనే దాకా వెళ్లాయి. ఇక చేసేది లేక మున్నాభాయ్ తనకి , రేఖకి పెళ్లి కాలేదు, పాడు కాలేదని అఫీషియల్ గా గాసిప్స్ అన్నీ ఖండించాల్సి వచ్చింది. ఇదంతా బుక్ లో చెప్పాడట రైటర్!
ఎప్పుడో సంవత్సరం కింద తన బుక్ లో రేఖా, సంజయ్ లకు పెళ్లి కాలేదని ఒక రైటర్ రాస్తే... ఇప్పుడు దాన్ని తిరగదోడి పెళ్లైందంటూ ప్రచారం చేయటం... నిజంగా అరాచకం! కానీ, సినిమా సెలబ్రిటీలకు ఈ సైడ్ ఎఫ్టెక్స్ తప్పువు! కాకపోతే, యాభై ఏళ్ల వయస్సు దాటిపోయిన ఈ తరుణంలో సంజు బాబా, రేఖ లాంటి వారు సీక్రెట్ మ్యారేజ్ పుకార్లు ఎదుర్కోవటం... కొంచెం ఇబ్బందికరమే!