తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు!!
posted on Nov 28, 2020 @ 2:12PM
తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంనగర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్ జైలుకు పోవటం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఅర్ అవినీతి ప్రభుత్వం కూలిపోతుందని, మధ్యంతర ఎన్నికలు తప్పవని అన్నారు.
మరోవైపు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని, ఆ తరువాత ఆరు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయి మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యల చూస్తోంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొని, నిజంగానే కేసీఅర్ ప్రభుత్వం కూలిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.