కేసీఆర్ ను బాగా చూసుకోండి.. మళ్లీ ఎప్పుడు కనిపిస్తారో? రాములమ్మ ట్వీట్
posted on Nov 28, 2020 @ 2:31PM
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై దాడి పెంచింది ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతి. రోజూ ఏదో ఒక అంశంతో గులాబీ నేతలను టార్గెట్ చేస్తున్న రాములమ్మ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న సభపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ను ఎల్బీ స్టేడియం సభలోనే బాగా చూసుకోవాలని జనాలకు సూచిస్తూ ఆమె ట్వీట్ చేశారు. కేసీఆర్ మళ్లీ ఎప్పుడు కనిపిస్తారో అంటూ సెటైర్లు విసిరారు. ‘నేటి సభలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒకసారి చూసుకోండి. మళ్లీ... ఎప్పుడు కనిపిస్తారో? ఇప్పట్లో ఎన్నికలు లేకుంటే వారు కనబడేది, వినబడేది అసాధ్యమే. సీఎం కేసీఆర్ ఇచ్చే కామెడీ వాగ్దానాల ద్వారా ప్రజలకు ఏదో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే... ఎప్పటిలాగే హామీల అమలు ఏమీ ఉండదని మనకు తెలిసిందే’ అంటూ సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై కామెంట్ చేస్తూ విజయశాంతి ట్వీట్ చేశారు.