నిమ్మగడ్డ ను కుక్కలు కూడా పట్టించుకోవు
posted on Feb 6, 2021 @ 2:21PM
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ ఎమ్మెల్యే మహిళా ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి విరుచుకుపడ్డారు. మార్చి దాటితే నిమ్మగడ్డను కుక్కలు కూడా పట్టించుకోదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు 2019లోనే టీడీపీని సమాధి చేశారని, సమాధి అయిన టీడీపీ కి పునర్ జీవం పోయాలని, టీడీపీని బతికించుకునే బాధ్యతను నిమ్మగడ్డపై చంద్రబాబు, లోకేశ్ పెట్టారన్నారు. అందుకే నిమ్మగడ్డ టిడిపి ని బతికించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన, సంక్షేమపథకాలతో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీలో జగన్ చేస్తున్నారని, సర్పంచులు మెజారిటీ వైసీపీ ఉండాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ఎన్ని అడ్డంకులు వేసిన, ఆనకట్టలు కట్టిన మెజారిటీ వైసీపీ దేనని రాజా జోస్యం చెప్పారు. నిమ్మగడ్డ ఎన్నికల కమిష్నర్ గా కాకుండా ఒక పార్టీకి కార్యకర్తగా పని చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి, ప్రభుత్వ పథకాలు అమలు కోసం.. ఏకగ్రీవం చేసుకున్నామని గ్రామస్థులే చెబుతున్నారని, ఇది విన్నాక ఆయన తల ఎక్కడ పెట్టుకుంటారంటూ నిమ్మగడ్డను ఉద్దేశించి రాజా వ్యాఖ్యానించారు. ప్రతి దానికి ఏదో ఒకటి అడ్డువేస్తూ ఆపాదిస్తున్నారని ,భవిష్యత్తులో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారని రోజా పేర్కొన్నారు. అధికారులు ఎవరికీ అనుకూలంగా పని చేయాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చేస్తే సరిపోతుందన్నారు. అధికారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు.