పారా ఒలింపిక్స్ లో సత్తా చాటుతున్న దివ్యాంగులు.. మరో స్వర్ణం
posted on Sep 14, 2016 @ 10:35AM
రియో పారా ఒలింపిక్స్ లో భారత్ మరో ఘనత సాధించింది. ఇప్పటికే హైజంప్‌లో తమిళనాడుకు చెందిన ఆటగాడు భారత్‌కు తొలి స్వర్ణ పతకం సాధించగా ఇప్పుడు మరో స్వర్ణం మన దేశ ఖాతాలో చేరిపోయింది. జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝుఝురియా స్వర్ణం సాధించి దేశ కీర్తిని పెంచాడు. ఈ పతకంతో రియో పారా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం వచ్చి చేరాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో పాల్గొన్న దేవేంద్ర ఝఝారియా జావెలిన్‌ను 63.97 మీటర్లు విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో తన పేరిట ఉన్న62.15 మీటర్ల రికార్డు ప్రపంచ రికార్డుని బద్దలు కొట్టాడు.
ఇదిలా ఉండగా ప్రధాని మోడీ ఝుఝురియాకు అభినందనలు తెలిపారు. అద్భుత ప్రదర్శనతో ఝుఝురియా చరిత్రాత్మక విజయం నమోదు చేశారని పేర్కొన్నారు. మొత్తానికి రియో ఒలింపిక్స్ల్ లో మనవాళ్లు సాధించలేనిది... పారా ఒలింపిక్స్ లో వికలాంగులు అయినా దేశానికి స్వర్ణ పతకాలు తెచ్చిపెట్టారు.