కొడుకుపైనే వేటు వేసిన ములాయం...
posted on Sep 14, 2016 @ 11:12AM
యూపీ సమాజ్ వాది పార్టీలో గత కొద్ది రోజులుగా కుటుంబ రాజకీయాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ బహిరంగ సభలో సొంత కొడుకు అని కూడా చూడకుండా ములాయం సింగ్ యాదవ్ సీఎం అఖిలేశ్ యాదవ్ పై విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. ఇప్పుడు ఏకంగా.. ఆయనను అధ్యక్ష పదవి నుండే తప్పించారు. వివరాల ప్రకారం.. ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులను అఖిలేశ్ యాదవ్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వీరు ములాయం సింగ్ కు అత్యంత సన్నిహితులైన నేతలు కావడంతో ఆగ్రహానికి గురైన ములాయం సింగ్ యూపీ సమాజ్ వాదీ అధ్యక్ష పదవి నుంచి అఖిలేశ్ ను తప్పించి.. ఆ స్థానంలో సోదరుడు శివపాల్ యాదవ్ ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో యూపీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కొడుకుపైనే వేటు పడుటంతో అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా తన సోదరుడు శివపాల్ యాదవ్..తన వర్గానికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆరోపిస్తున్న నేపథ్యంలో అతనిని బుజ్జగించడానికే ములాయం ఈ పని చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.