మునుగోడులో రికార్డు స్థాయిలో 93శాతం ఓటింగ్
posted on Nov 4, 2022 5:56AM
రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 93 శాతం పోలింగ్ నమోదయ్యాంది. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలన్నిటి కంటే మునుగోడు ఉప ఎన్నికలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో 84.75 శాతం, దుబ్బాకలో 82.61 శాతం, నాగార్జునసాగర్ 88 శాతం, హుజూరాబాద్‌లో 87 శాతం ఓటింగ్ నమోదైంది.
మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీ తలపడిన మునుగోడు ఉప ఎన్నిక చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.అక్కడక్కడా ఘర్షణలు, ఆందోళనలు తలెత్తినా మొత్తం మీద పోలింగ్ ప్రశాతంగానే ముగిసింది.
మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 5వేల మంది రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. మొత్తం 298 పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నల్లగొండ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించారు.