తెరాసదే విజయం..ఎగ్జిట్ పోల్సన్నీఒకే మాట
posted on Nov 3, 2022 @ 11:25PM
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ప్రధాన పార్టీలైన తెరాస, బీజేపీ, కాంగ్రెస్ లో హోరాహోరీగా తలపడ్డ ఈ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు జరిగింది. పోలింగ్ ముగిసిన తరువాత వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. దాదాపు అన్నిసర్వే సంస్థలూ విజయం టీఆర్ఎస్ లే నని తేల్ేశాయి. మునుగోడు ఉప పోరులో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ ప్రకటింయాయి.
రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నిలుస్తారని తేల్చశాయి. శ్రీ ఆత్మసాక్షి ప్రకటించిన ఎగ్జిట్ పోల్ లో తెరాసకు 42 శాతం ఓట్లు, బీజేపీకి 35 నుంచి 36 శాతం ఓట్లు వస్తాయనీ, కాంగ్రెస్ 17.5 శాతం ఓట్లకే పరిమితమౌతుందని, బీఎస్పీకి 4 నుంచి 5 శాతం ఓట్లు, ఇతరులకు ఒక శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
పోతే పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ మేరకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లకు వరుసగా 44.4%, 37.3%, 12.5% ఓట్లు వస్తాయి.