రాములమ్మా...క్రికెట్ కీ కాషాయం పులమడమా?
posted on Sep 5, 2022 @ 1:53PM
ఆట ఆటే, గెలిచినా, ఓడినా క్రీడాభిమానుల సరదాలు, వేడుకలు మామూలే. ఆసియాకప్‌లో భాగంగా ఆదివారంనాటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రాజకీయరంగు పులుముకుంది. వారం రోజుల క్రితం పాకిస్తాన్ పై భారత్ గెలిచినపుడు వినిపించని వ్యాఖ్యానాలు ఆగష్టు 4న జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోగానే రాజకీయ రంగులో వినపడుతున్నాయి. గెలిచినందుకు పాక్ సంబంరాలు చేసుకోవడం అర్ధరహితమని బీజేపీ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగా రాములమ్మ భారత్-పాక్ మ్యాచ్ పై స్పందించారు.
క్రికెట్ మ్యాచ్ అయినా సరే భారత్ కు పాకిస్తాన్ సమ ఉజ్జీగా కాదన్న అభిప్రాయాన్నే ఆమె వ్యక్తం చేశారు. ఓటమిని మనం అంగీకరిస్తే పాక్‌ను మనతో సమానంగా చూసినట్టేనని ఆమె ఆగ్రహించారు. ఆసియా కప్ లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండి యా ఓడిందని మనోళ్లు నిరాశ పడటం గెలిచినందుకు పాక్ సంబరాలు చేసుకోవడం పూర్తిగా అర్థ రహితమన్నారు. భారత్‌తో ఎక్కువగా ఓడిపోతూ వస్తున్న పాక్‌లో వారి విజయాన్ని సంబరం చేసుకోవడం వాళ్ళకి బాగుంటుంది కానీ, మనం బాధపడటంలో ఏ మాత్రం అర్థం లేదన్నారు. ఎన్నో దేశాలపైన పదే పదే విజయాలు సాధించిన టీమిండియాకి ఈ ఓటమి ఒక లెక్క కానే కాదని, అప్పు డప్పుడూ ఎదురయ్యే ఓటముల్లో ఇదీ ఒకటిగా తీసుకోవాలన్నారు.
అయితే మన దేశంలో ఉగ్రవాదానికి ఊతమిస్తూ, మనని నిరంతర శత్రువుగా చూస్తూ, తన ఆర్థిక వ్యవ స్థని నాశనం చేసుకుని, దారుణంగా అప్పులపాలై చివరికి జూలోని జంతువుల్ని కూడా అమ్ము కుంటూ, ఏ విషయంలోనూ మనకి సరితూగని పాకిస్తాన్ ఏదో ఒక మ్యాచ్‌లో టీమిండియాపై గెలిచినంత మాత్రాన అదే దో పెద్ద విషయం అన్నట్టు చూడటం మన స్థాయికి తగదని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.