చూడతరమా.. ఏపీ సర్కార్ యాప్ మహిమ!
posted on Sep 5, 2022 @ 12:13PM
కాలం మారుతోన్నకొద్దీ సాంకేతికత ఇబ్బందికరంగా మారుతోంది. మొబైల్, యాప్‌ల రాజ్యం ఇది. ప్రతీదీ యాప్‌లకు అనుసంధానం చేయడం మీద దృష్టిసారిస్తున్నారంతా. బడికి ఉపాధ్యాయుల రాకపోకల గురించి తెలుసుకోవడానికి ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం పెట్టిన నిబంధన ఉపాధ్యాయుల్లో ఆగ్రహం రెండింతలు చేసింది. అసలే జీతబత్యాలు, ట్రాన్స్‌ఫర్లు విషయాల్లో ప్రభుత్వ నియమ నిబంధనలతో సతమతమవుతున్న ఉపాధ్యాయులకు ఇపుడు ఈ యాప్ మరింత తలభారంగా మారింది.
ఉపాధ్యాయుల మీద బైండోవర్, అక్రమకేసులు, నోటీసులనిస్తూ అప్రజా స్వామి కంగా ప్రభుత్వం వ్యవహ రిస్తున్న తీరుపై ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఉపా ధ్యాయ సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వం సొంత ఫోన్లలో ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు వేసేలా ఒత్తి డి చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.
యాప్ గురించి ప్రభుత్వంతో యుద్ధానికి తలపడ్డారు. పరిస్థితులు గ్రహించిన జగన్ సర్కార్ యాప్ నిబం ధన అంశాన్ని మరోసారి పరిశీలిస్తామని, లోపాలు సవరించి నిర్ణయం తెలియజేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు కాస్తంత మెతకబడ్డారు. కానీ ప్రభుత్వం చెప్పినట్టుగా ఇచ్చిన హామీని విస్మరించింది. దాన్ని గురించి అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో ఉపాధ్యా యులు తాడోపేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల అవలంబి స్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రభుత్వ సత్కా రాలు, సన్మానాలు తిరస్కరించారు.
ప్రభుత్వ యాప్ విద్యార్ధులకు అస్త్రంగా మారితేనే మరీ తలనొప్పి. ఒకవేళ యాప్‌లో గడ్డం ఉన్నపుడు చూసిన ఉపాధ్యాయుడికి గడ్డం లేకుండా కనపడితే అటెండెన్స్ సమయంలో ఫేస్ గుర్తుపట్ట లేదని తిర స్కరిస్తే వచ్చే ఇబ్బంది అంతా యింతా కాదని విద్యార్ధులు సరదాగా యాప్‌ల మీద నెట్‌లో జోక్స్ పంచు కుంటున్నారు. యాప్ అనేది నిరంతరం బ్రహ్మాండంగా పనిచేస్తుందన్ననమ్మకం ఎవరు ఇస్తారు. నిరం తరం లోపాలు ఉండవన్న గ్యారంటీ లేదు. ఇలాంటి అర్ధరహిత విధానాలను అమలుచేసి జగన్ సర్కార్ తన తెలివిని స్వయంగా బయటపెట్టుకుంది.