నేషల్ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య..
posted on Oct 19, 2016 @ 12:22PM
నేషల్ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కబడ్డీ ప్లేయర్ రోహిత్ భార్య లలిత నిన్న రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అయితే లలిత ఉరేసుకొనే ముందు రాసిన సూసైడ్ నోట్, రెండు గంటల వీడియోను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కట్నం కోసం రోహిత్ కుటుంబం తనను వేధిస్తోందని, రోహిత్ తనను విడిచి వెళ్లాలని అన్నాడని ఆ వీడియోలో లలిత చెప్పింది. తన భర్త ఢిల్లీలో లేని సమయంలో తనను ఒంటరిగా ఉండాలని అత్తమామలు ఒత్తిడి తెచ్చేవారని.. రోహిత్ కూడా తనను వదిలి వెళ్లిపొమ్మని చెప్పాడని.. తన సంతోషం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. కాగా రోహిత్ ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించేవాడు. 2009లో నేవీలో చేరిన రోహిత్.. అప్పటి నుంచీ ముంబైలో ఉంటున్నాడు. మార్చిలో లలితను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు.