పారిస్ ఘటనపై వర్మ.. ఇక్కడా దేవుణ్ని వదల్లేదా..!
posted on Jul 15, 2016 @ 2:53PM
గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు మరోసారి పారిస్ లో జరిగిన ఘటనపై స్పందించి తన దైన శైలిలో ట్విట్టర్లో ట్వీటాడు. ఈరోజు తెల్లవారుజామున ప్రాన్స్ లోని నీస్ లో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ ట్రక్కుతో ఉగ్రవాది మనుషులపై దాడి జరుపగా..ఆ దాడిలో 80 మందికి పైగా చనిపోయారు. అయితే దీనిపై స్పందించిన రాంగోపాల్ వర్మ... 'నీస్‌లో జరిగిన ఘటన బాగో లేదు. ఇలాంటి తీవ్ర ఘటనలు ఎక్కడైనా జరగొచ్చు. జరగకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాలని ఉంది కానీ ఏ దేవుడిని ప్రార్థించాలో తెలియడంలేదు అని అన్నాడు. ఇలాంటి సామూహిక హత్యలు చేయడానికి బాంబులు అవసరంలేదు, వాహనాలు ఉంటే చాలని ఈ ఘటన నిరూపించింది. నీస్ దాడిని ఖండిస్తున్నాం అంటూ రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జోకుల్లాగా మారిపోయాయి. ఇలాంటి దాడులకు పాల్పడే క్రూరులు మంచి మాటలు వింటారా?' అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు వర్మ. మొత్తానికి ఈ విషయంలో కూడా వర్మ దేవుడిని వదిలిపెట్టలేదు.