ఒక్క రూపాయికే ఫోన్..
posted on Jul 15, 2016 @ 3:36PM
అతి తక్కువ ధరకే ఫ్రీ డమ్ 251 పేరుతో రింగింగ్ బెల్స్ అనే సంస్థ స్మార్ట్ ఫోన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేవలం ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్ అందిస్తామని ఓ మొబైల్ సంస్ధ ప్రకటించింది. ఇంతకీ ఏం కంపెనీ అనుకుంటున్నారా.. షియోమీ మొబైల్ సంస్థ. అసలు సంగతేంటంటే.. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ షియోమీ భారత్‌లో అడుగుపెట్టి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా షియోమీ వినియోగదారులకు కొన్ని ఆఫర్లు అందిస్తోంది. దీనిలో భాగంగానే కేవలం ఒక్క రూపాయికే ఫోన్లు, పవర్‌బ్యాంక్‌లు లాంటి వస్తువులను ఇవ్వనుంది. అయితే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది.. ఆఫర్ల వివరాలు..
* తొలి రోజు 10 షియోమీ ఎంఐ 5 ఫోన్లు, 100 పవర్‌బ్యాంకులు
* రెండో రోజు 10 రెడ్‌మీ నోట్3 ఫోన్లు, 100 ఎంఐ బ్యాండ్‌లు,
* మూడో రోజున 10 ఎంఐ మ్యాక్స్ ఫోన్లు, 100 ఎంఐ బ్లూటూత్ స్పీకర్లను ఫ్లాష్‌సేల్‌కు ఉంచింది.
అయితే దీనికోసం యూజర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉందని.. ఆ మూడు రోజుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఫ్లాష్‌సేల్ ఉంటుందని సంస్థ తెలిపింది. జులై 19లోగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేస్తామని షియోమీ పేర్కొంది.