తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
posted on Sep 20, 2022 @ 2:26PM
తెలంగాణలో మళ్లీ ముసురేసింది. వాతావరణం చల్లబడింది. రానున్న రెండు రోజులూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 48 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, ఈశాన్య, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అలాగే హైదరాబాద్ నగరంలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకావం ఉందని పేర్కొంది. నగరంలో సాయంత్రం, రాత్రి సమయాలలోనే వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో మంచిర్యాల, జగిత్యాల, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.