Read more!

ప్రధానిగా రాహుల్ లోక్ సభలో అడుగుపెడతారు.. రేవంత్

 అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న విపక్షాల డిమాండ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రాహుల్ పై అనర్హత వేటు వేశారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షడు రేవంత్ రెడ్డి విమర్శించారు.

గతంలో రాజ్యసభ వేదికగా ప్రధాని మోడీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని ఉద్దేశించి శూర్పణఖ అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.

వారు గాంధీ కుటుంబాన్ని బెదరించాలని చూస్తున్నారనీ, ప్రజాస్వామ్య వాదులంతా రాహుల్ గాంధీతోనే ఉన్నారని రేవంత్ పేర్కొన్నారు.  గతంలో జనతా పార్టీ ప్రభుత్వం  ఇందిరాగాంధీపై జనతా పార్టీ ప్రభుత్వం ఇందిరా గాంధీ పై ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చి లోక్ సభలో అడుగుపెట్టకుండా బహిష్కరించిందనీ, అయితే ఆమె 1980లో భారత ప్రధానిగా పార్లమెంటులో అడుగుపెట్టారనీ రేవంత్ గుర్తు చేశారు. రాహుల్ కూడా 2024లో భారత ప్రధానిగా సభలో అడుగుపెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.