Read more!

ఆ నలుగురూ సస్పెండ్.. క్రాస్ ఓటింగ్ కు కోట్లు తీసుకున్నారు.. సజ్జల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ విషయంలో వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయ్యారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని పేర్కొంటూ నలుగురు ఎమ్మెల్యేలను జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

తొలి నుంచీ పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డిలతో పాటు.. ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని భావిస్తున్న ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం (మార్చి 24) ప్రకటించారు. అసెంబ్లీ మీడియా పాయంట్ వద్ద విలేకరులతో మాట్లాడిన సజ్జల పార్టీ నుంచి సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేలూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని, ఇందుకు వీరు విపక్ష నేత చంద్రబాబు నుంచి కోట్లాది రూపాయలు అందుకున్నారని పేర్కొన్నారు.