భారత్ జోడో యాత్ర...రాహుల్ వెంట యువత
posted on Sep 8, 2022 @ 1:13PM
వచ్చే ఎన్నికల సమయానికి దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ తమ పార్టీ సుస్థిరత్వాన్ని ఆశిస్తూ బీజెపీ భారీ ప్రచారాలు, సమావేశాలు నిర్వహిస్తున్నతరుణంలో అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా దేశం అన్నిప్రాంతాల్లో తమ పార్టీని మరింత పటిష్టపరచడానికి, ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన గురించి వివరించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర బుధవారం ఆరంభించారు. కన్యాకుమారిలో ఆరంభమయిన యాత్రకు మంచి స్పందన వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర కొనసాగుతోంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభమ యింది. రాహుల్ గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వెంట నడవనున్నారు. ఇవాళ మొత్తంగా 20 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. మధ్యా హ్నం 2 గంటలకు మహిళలతో భేటీ కానున్నారు. ఇక రాత్రి 7 గంటల వరకు పాదయాత్ర సాగనుం ది.
ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు రెండు విడతలుగా రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీ సీని యర్ నేతలతో పాటు వేలాదిగా కార్య కర్తలు హాజరయ్యారు. రెండో రోజు పాదయాత్ర సమయంలో చిన్నారులతో మమేకం అయ్యారు. కేరళలోని 12 లోక్‌సభ, 42 అసెంబ్లీ స్థానాల్లో సెప్టెంబర్ 29 వరకు యాత్ర సాగనుంది. రాష్ట్రం లోని త్రిసూర్ ప్రాంతంలో ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.