సీఎం సీటుపై కాంగ్రెస్ నేతల కన్ను
posted on Feb 24, 2014 @ 12:02PM
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకశాలపై కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి షిండే వెల్లడించడంతో కాంగ్రెస్ నేతల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రి పీఠ౦ ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సీమాంద్రలో కన్నాలక్ష్మీనారాయణ, పీసీసీ బొత్స సత్య నారాయణ, ఆనం రా౦ నారాయణ రెడ్డి రేసులులో వుండగా, తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, ఎస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి. శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అదిష్టానం నుంచి కేంద్రమంత్రి చిరంజీవికి కూడా పిలుపు రావడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి సీటు కోసం ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ లు నడుస్తున్నాయి. ఈ రోజు సోనియాతో సభాపతి నాదెండ్ల మనోహర్, దామోదర రాజనరసింహ, సీనియర్ నేత గంగా భవానీ లు వేర్వేరుగా భేటి అయ్యారు. డిగ్గీతో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు భేటీ అయ్యారు.