వీలినం...రాహుల్ తో కేసిఆర్ మంతనాలు
posted on Feb 24, 2014 @ 12:37PM
టీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు ఢిల్లీలో రోజు వరుస భేటిలతో బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఉదయం ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్ తో కేసిఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ వీలీనం, ఎన్నికల పొత్తుల పై ఈ భేటిలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రము ఇచ్చినందుకు కృతజ్ఞతగా కొన్నిరోజులుగా ఢిల్లీ లోని ముఖ్యనేతలందరిని కలుస్తున్నారు. ఈ రోజు రాష్ట్రపతిని కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.
ఆదివారం కుటుంబ సమేతంగా కేసిఆర్ సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అవసరాలపై ఆమెకు నివేదికనిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఏకైక కారకురాలు సోనియా గాంధీయేనని, అందుకే ఆమెకు కృతజ్ఞతలు చెప్పడానికే కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చానని చెప్పారు. తమందరికీ సోనియా తన దీవెనలు అందజేశారని చెప్పారు.