క్వీన్ ని ఆకట్టుకున్న ట్రినిటీ చర్చి
posted on Sep 10, 2022 @ 4:22PM
క్వీన్ ఎలిజబెత్-2కు జంటనగరాలతో ఆత్మీయ అనుబంధం ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్ బొల్లారం లోని హోలీ ట్రినిటీ చర్చి అంటే ప్రత్యేక అనుబంధం. ఎలిజబెత్ దంపతులు తమ 36వ వివాహ వార్షి కోత్సవాన్ని అక్కడే జరుపుకున్నారు. విక్టోరియా రాణి ఇచ్చిన నిధులతోనే 1847లో ఈ చర్చి నిర్మాణం జరిగింది. అందు వల్ల ఆ చర్చిపట్ల ప్రత్యేక ఆకర్షణ. విక్టోరియా రాణి మునిమనవరాలయిన ఎలిజబెత్-2 ఇక్కడి బిషప్ ల ప్రత్యేకాహ్వానం మేరకు చర్చిని సందర్శించారు. అందరినీ ఎంతో ప్రేమతో పలకరిం చారు.
ఎలిజబెత్ -2 1983లో భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఆ ఏడాది నవంబర్‌లో హైదరా బాద్ వచ్చారు. రాణి దంపతులకు అప్పటి సమైక్య రాష్ట్ర గవర్నర్ రామ్‌లాల్, ముఖ్యమంత్రి నంద మూరి రామారావు స్వాగతం పలికారు. నాలుగు రోజులుపాటు సాగిన ఈ పర్యటనలో నగరంలోని బీహెచ్ ఈఎల్, ఇక్రి శాట్, కుతుబ్‌షాహి సమాధులను సందర్శించారు.
1947లో క్వీన్ ఎలిజబెత్-2 వివాహం సందర్భంగా అప్పటి నిజాం ప్రభువు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆమెకు అత్యంత విలువైన వజ్రాలహారాన్ని బహుమతిగా అందజేశారు. లండన్‌కు చెందిన నగల తయారీ సంస్థ కార్టియర్ ప్రతినిధులను రాణి వద్దకు పంపిన నిజాం ప్రభువు.. కానుకను ఎంచుకోవాలని కోరారు. దీంతో 300 వజ్రాలు పొదిగిన ఓ ప్లాటినం నెక్లస్‌ను ఆమెను ఎంపిక చేసుకు న్నారు. క్వీన్ ఎలిజబెత్-2 వివిధ సందర్భాల్లో ఆ హారాన్ని ధరించారు.